Fear Telugu Song Lyrics – Devara Part 1 –


Fear Telugu Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా అనిరుధ్ రవిచందర్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన ఈ పాట ‘దేవర’ తెలుగు సినిమాలోది.

Fear Telugu Song Lyrics in English

M: Aggantukundi Sandram
Bhagguna Mande Aakasam
Araachakaalu Bhagnam
Challaare Chedu Saahasam

Fear Telugu Song Lyrics in Telugu

అ: అగ్గంటుకుంది సంద్రం
కో: ఏహా
అ: భగ్గున మండె ఆకసం
అ: అరాచకాలు భగ్నం
కో: ఏహా
చల్లారె చెడు సాహసం

అ: జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని

అ: దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే

అ & కో: కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే…

అ: దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత, దేవర

కో: దేవరా ఓ
ఓ యే, ఓ యే ఓ యే.

అ: జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

అ: కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా
అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా…

అ: దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట

అ & కో: దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే

అ: దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత, దేవర

కో: దేవరా ఓ
ఓ యే, ఓ యే ఓ యే

Watch ఫియర్ Lyrical Song

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ఫియర్’ పాటను విడుదల చేశారు. ఈ సంవత్సరం దసరా పండుగకు భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’.

Fear Telugu Song Lyrics Credits

Dj Tillu salaar